తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన కోసం బయలుదేరారు.ఇవాళ, రేపు ఆయన దేశ రాజధానిలో పర్యటించనున్నారు. ఏఐసీసీ పెద్దలతో ఆయన సమావేశం అవుతారని తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.అదేవిధంగా, శనివారం వీహెచ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలోనూ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో కార్యవర్గ కూర్పుతో పాటు మంత్రివర్గ విస్తరణపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఇకపోతే పార్టీలో చేరిన పక్క పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వారిని సస్పెండ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తముందని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి కామెంట్స్‌పై పార్టీ అధిష్టానంతో పీసీసీ చీఫ్ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.