కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజల ఆతృత ఈ రెంజ్ లో ఉంది!

-

తెలంగాణలో కరోనా జెట్ స్పీడుగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం లైట్ తీసుకుందో లేక ఎవరి చావు వారిని చావనిద్దాం అని వైరాగ్యం ప్రదర్శిస్తుందో తెలియదు కానీ… గత రెండు రోజులుగా తెలంగాణలో 3700 కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది కూడా అరకొరగా జరుగుతున్న టెస్టుల రిజల్ట్! అలా కాకుండా యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుని రోజుకు భారీ సంఖ్యలో టెస్టులు చేస్తే.. ఫలితం ఊహకి అందదేమో!! స్పీకర్, డిప్యుటీ స్పీకర్, హోంమంత్రి, ఎమ్మెల్యేలు, ప్రగతి భవన్ లో ఉద్యోగులు ఇలా ఒకరేమిటి అందరినీ అల్లల్లాడిస్తుంది కరోనా! ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు?

కరోనా ప్రబలిన కొత్తలో సీఎం కేసీఆర్ చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. ఎవరూ పెద్దగా ఊహించని సమయంలోనే లాక్ డౌన్ విధించి.. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ.. ప్రజలకు ఆరోగ్యరహస్యాలు చెబుతూ తెగ హల్ చల్ చేశారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు అన్ని దుకాణాలు తెరిచి అన్ లాక్ ప్రకటించిన వేళ కనిపించకుండాపోయారన్న కామెంట్లు పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పుడు కేసీఆర్ గురించి అందరూ ఆరాతీస్తున్నారట. ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

అందుకే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా… సీఎం కేసీఆర్ ఎక్కడ? అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు.. ఆయన కోసం ఏకంగా “వేర్ ఈజ్ కేసీఆర్” అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ నెటిజన్లు ట్రెండింగ్ చేస్తున్నారు. మరి ఇప్పుడైనా కనీసం ఏ జూం య్యాప్ ద్వారానో, ఎఫ్.బి. లైవ్ ద్వారానో కేసీఆర్ ప్రజలకముందుకు రావాలని, పరిస్థితిని అర్ధం చేసుకుని చర్య్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version