తెలంగాణలో నేడు ఆర్టీసీ సర్వీసులు రద్దు !!

-

నేటి నుంచి మావోయిస్టు పార్టీ 21వ PLGA వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు… మావోయిస్టు ప్రాంతాల్లో నిత్యం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా… గోదావరి పరివాహక ప్రాంతాలపైనే నిఘా పెంచారు పోలీసులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలతో రిక్కి నిర్వహిస్తున్నారు పోలీసులు.. చత్తీస్ ఘడ్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వెంకటాపురం వాజేడు మండలాలకు వచ్చే రహదారులపై నిఘా పెంచారు పోలీసులు.

అలాగే… భద్రాచలం నుంచి వెంకటాపురం వాజేడు, చర్ల , రాత్రివేళల్లో ఆర్టీసీ సర్వీసులు రద్దు చేశారు ఆర్టీసీ అధికారులు. ఏజెన్సీ లోని వెంకటాపురం, వాజేడు, పోలీస్ స్టేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్. మావోయిస్టులు కనబడితే.. అరెస్ట్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పోలీసులు. అటు విశాఖ ఏఓబీలో హై అలెర్ట్ అయ్యారు పోలీసులు. నేటి నుంచి PLGA వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోలు…ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు అలజడి సృష్టించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆపరేషన్ పరివర్తన్ విస్త్రతంగా జరుగుతున్న క్రమంలో మరింత అప్రమత్తం అయ్యారు పోలీసులు…

Read more RELATED
Recommended to you

Exit mobile version