ఏపీ మంత్రి అనిల్‌పై తెలంగాణ పోలీసుల కేసు !

-

ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ పై తెలంగాణలో పోలీస్‌ కేసు నమోదైనట్లు సమాచారం అందుతోంది. నెల్లూరు జిల్లాలో పెన్నా కాల్వకు చెందిన టెండర్ల విషయంలో జరిగిన గోల్‌ మాల్‌ వ్యవహారం హైదరాబాద్‌ లో జరిగింది. ఆ టెండర్లను ఖరారు చేసేముందు రివర్స్‌ టెండర్లకు వెళ్లారు. అయితే అందులో ఎవరూ పాల్గొనవద్దని మంత్రి అనిల్‌ బాబాయ్‌, నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌ బెదిరించినట్లుగా కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌ లో ఈ బెదిరింపులకు పాల్పడటంతో.. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు గత నెల 506, 504 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోను, వాట్సాప్‌ కాల్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని కాంట్రాక్టర ఫిర్యాదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ ను నెల్లూరు టీడీపీ ఏతలు మీడియాకు రిలీజ్‌ చేశారు. ఈ కేసు విషయంలో మంత్రి అనిల్‌ బాబాయ్‌,.. రూప్‌ కుమార్‌ కు మరో వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన వివరాల్లో మరొక ఫోన్‌ నంబరు ఉందని.. అది మంత్రి అనిల్‌ కుమార్‌ దేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ కేసులో త్వరలో ఆయనకు నోటీసులు ఇస్తారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version