తెలంగాణ పోలీసులకు.. ఏపీలో ట్రైనింగ్.. భలే.. భలే..?

-

తెలంగాణఆంధ్రా.. 2005 నుంచి 2014.. ఆ తర్వాత కూడా ఈ రెండు ప్రాంత నాయకుల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి.. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. ఏర్పడిన తొలినాళ్లలోనూ.. ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య కూడా విభజన సమయంలో చాలా వాగ్వాదాలు జరిగాయి.. కానీ.. ఇప్పుడు సీన్ మారిందితెలుగు జాతి మనది.. రెండుగ వెలుగు జాతి మనది అన్నట్టుగా ఉంది నేటి పరిస్థితి.

ముఖ్యమంత్రులు కేసీఆర్జగన్ స్నేహితుల్లా వ్యవహరిస్తుండటం వల్ల.. ఈ రెండు రాష్ట్రాలు కలసి ముందుకెళ్లే ఆలోచనలు చేస్తున్నాయిఅందుకు తాజా ఉదాహరణ.. ఈ పోలీసుల శిక్షణ.. తాజాగా ఆదివారం జరిగిన కేసీఆర్జగన్ భేటీలో.. విద్యుత్పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించారుఅపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారుచర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలో 18వేల మంది పోలీసులను ఒకే సారి నియమిస్తున్నారుఅందులో 4వేల మందికి ఆంధ్రప్రదేశ్ లో శిక్షణనివ్వాలని కేసిఆర్ ఏపి ముఖ్యమంత్రిని కోరారుదీనికి జగన్ సానుకూలంగా స్పందించారుపోలీసులకు ఒకే సారి శిక్షణనివ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు తెలంగాణకు కలుగుతుంది.

గోదావరి జలాలను ఉమ్మడిగా వినియోగించుకునే అవకాశాలపైనా సీఎంలు మాట్లాడుకున్నారు.వీలైనంత తక్కువ భూసేకరతోతక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని నిర్ణయించారుగోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండిఎలా తరలించాలిఅలైన్ మెంట్ ఎలా వుండాలిఅనే విషయాలు చర్చించారుఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా వుండే విధంగా జలాల తరలింపునీటి వినియోగం వుండాలని కేసీఆర్జగన్ నిర్ణయించారుదీనికోసం రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారుఅందుకే అంటారు కలసి ఉంటే.. కలదు సుఖం అని.

Read more RELATED
Recommended to you

Exit mobile version