Telangana Weather Update : తెలంగాణలో మరో వారంపాటు వర్షాలు

-

తెలంగాణలో మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు కొన్ని చోట్ల పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ప్రజలు డయల్ 100 కు కాల్ చేయాలని తెలిపారు.

మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, మంచిర్యాల, కరీంగనర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు నుంచి 12 వ తేదీ వరకు ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version