
తెలంగాణ లో కరోనా విజృంబన అస్సాలు తగ్గడం లేదు. తాజాగా నిన్న ఒక్క రోజే 1087 కేసులు 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా తెలంగాణ లో 13,436 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వగా మరణాల సంఖ్య 243 కు చేరింది. కాగా నిన్న 162 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా 4,928 మంది ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసులు 8,256 ఉన్నాయి. కేవలం నిన్న ఒక్క రోజులులోనే జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5, నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో 3, సిద్దిపేటలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 2, ఆసీఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.