తెలంగాణ యాస‌తో బాక్సాఫీస్ కు బీట‌లే

-

టాలీవుడ్ ట్రెండ్ మారింది. ఆరు పాట‌లు, నాలుగు ఫైట్లు..రొమాంటిక్ స‌న్నివేశాల‌తో మెప్పించే రోజుల‌కు కాలం చెల్లింది. న‌వ‌త‌రం కొత్త ఆలోచ‌న‌ల‌తో సినిమాలు చేస్తోంది. ప్ర‌యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోమ‌ని రుజువు చేస్తున్నారు. అందులో తెలంగాణ యాస భాష కూడా ఒక‌టి. ఆ భాష‌ను క్యాష్ చేసుకున్న ద‌ర్శ‌క‌, హీర్, నిర్మాత‌లెంతో మంది. ఇప్పుడు తెలంగాణ యాస ట్రెండ్ మార్కెట్ లో జోరుగా కొన‌సాగుతోంది. ఆ యాస‌తో బాక్సాఫీస్ షేకైపోతుంది. ఓసారి వివ‌రాల్లోకి వెళ్తే…

Telangana Slang – The New Trend In Tollywood

1989లో రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడి రుద్ర నేత్ర‌తో తెలంగాణ యాస భాష‌కు తెలుగు సినిమా లో పునాది ప‌డింది. ఒకే ధోర‌ణిలో డైలాగుల‌తో సినిమాలు కొన‌సాగుతున్న రోజుల్లోనే ద‌ర్శ‌కేంద్రుడు చిరంజీవితో ఆ సినిమాలో తెలంగాణ యాస‌లో కొన్ని డైలాగులు చెప్పించాడు. అప్ప‌ట్లో ఆ డైలాగులు తెలంగాణ మిన‌హా అన్ని చోట్లా చాలా కొత్త‌గా అనిపించింది. త‌ర్వాత విక్టరీ వెంక‌టేష్ న‌టించిన పోకిరి రాజా సినిమాలో ఆ స్లాంగ్ ను వాడారు. నిజానికి ఆ సినిమాలో తెలంగాణ భాష డైలాగులు ఎక్కువ‌గానే ఉంటాయి. కానీ స‌రైన ప్ర‌చారం లేక‌పోవ‌డంతో ఆ స్లాంగ్ కు ఆద‌ర‌ణ అంత‌గా ద‌క్క‌లేదు. మ‌ళ్లీ కొన్నేళ్ల త‌ర్వాత అక్కినేని నాగార్జున కింగ్ సినిమాలో తెలంగాణ యాస‌తోనే బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టాడు. ఆ భాష‌పై ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుని నేచుర‌ల్ గా చెప్పి డైలాగ్ ల‌తో మెప్పించాడు. అప్ప‌టి నుంచి ఆ యాస‌కు మ‌రింత ఐడెంటిటీ ద‌క్కింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖుషీ, జ‌ల్సా సినిమాల్లోనూ ఆ యాస‌తో అద‌ర‌గొట్టాడు. అట‌పై మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా శ్రీనువైట్ల దూకుడు సినిమా మొత్తాన్ని తెలంగాణ యాస‌ను హైలైట్ చేస్తూ చేసాడు. ఓ పెద్ స్టార్ ఫుల్ లెంగ్త్ రోల్ లో తెలంగాణ యాస లో సంభాష‌ణ‌లు చెప్ప‌డం ఆడియ‌న్స్ కు కొత్త అనుభూతిన్చింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ రామారావు పాత్ర‌లో బాద్ షాలోనూ కాకా అంటూ ఇర‌గ‌దీసాడు. ఇక విజ‌య్ దేర‌కొండ తెలంగాణ యాస‌తోనే పెద్ద స్టార్ అయిపోయాడు. అత‌ను స్టార్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం తెలంగాణ భాషే. ఈ మ‌ధ్య‌నే హీరోగా ప‌రిచ‌య‌మైన విశ్వ‌క్ సేన్ కూడా హైద‌ర‌బాద్ యాసతో ( ఫ‌ల‌కనుమాదాస్) డెబ్యూతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఇటీవ‌లే రామ్-పూరి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ ప‌క్కా హైద‌రాబాద్ యాస్ తో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. రామ్ కు కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. ఇంకా ఎఫ్-2లో వ‌రుణ్ తేజ్, రుద్ర‌మ‌దేవిలో అల్లు అర్జున్, శ్రీకాంత్, నితిన్, విష్ణు, నిఖిల్ టీ-స్లాంగ్ లో మెప్పించిన వాళ్లే. మేక‌ర్స్ తెర‌పై ఈ స్లాంగ్ ను స‌రైన ప‌ద్దతిలో గ‌నుక ఎగ్జిక్యూట్ చేయ‌గ‌లిగితే తిరుగు లేదు

Read more RELATED
Recommended to you

Exit mobile version