ఫార్ములా ఈ-రేస్ కేసు వ్యవహారంలో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీకు లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి. నిధుల దుర్వినియోగం జరిగిందా? లేదా? అనే అంశంపై విచారణ జరపాలని.. ఏసీబీకు లేఖ రాశారు సీఎస్ శాంతికుమారి.
ఇక ఈ లేఖకు.. విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ లెటర్ ఎటాచ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు.. ఏసీబీకి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి.
ఇది ఇలా ఉండగా…. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొగోడే అయితే E-కార్ రేసింగ్ తో పాటు అన్ని స్కామ్ లపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయాడు అల్లు అర్జున్. తెలంగాణ సీఎం అని అటు ఇటు చూశాడు. అయితే పేరు మరిచిపోగానే జైలులో పెడతావా..? అని ప్రశ్నించారు కేటీఆర్.