తెలంగాణ టెన్త్ స్టూడెంట్స్ కు అలర్ట్ న్యూస్.. కరోనా కారణంగా గత రెండేళ్ళు దేశంలో ఎటువంటి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించలేదు.పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే.దాంతో సిలబస్ పూర్తీ కాక పోవడం తో పరీక్షలు కూడా జరగలేదు.ఈ మేరకు ఈ ఏడాది అన్నీ పరీక్షలను ఆయా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.. ఈ మేరకు పరీక్షల తేదీలను సైతం విడుదల చేశారు అధికారులు. అయితే.. ఈ ఏడాది కూడా కొన్ని రోజుల పాటు ఆన్లైన్ విధానంలోనే విద్యా బోధన జరిగింది. దీంతో సిలబస్ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడం, విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉండడంతో సిలబస్ ను కొంత మేర తగ్గించారు. దీంతో ప్రశ్నాపత్రాల కూర్పు కూడా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తోంది.
ఫిజిక్స్ పేపర్ పార్ట్ ఎ మరియు పార్ట్ బి గా విభజింపబడింది.పార్ట్ ఏలో మూడు సెక్షన్లు ఉంటాయి.
1. మొదటి సెక్షన్లో 6 ప్రశ్నలు ఉంటాయి. అందుటో మూడు రాయాలి. ఒక్కో ప్రశ్నలకు రెండు మార్కులు మొత్తం 3*2=6మార్కులు.
2.సెక్షన్ 2 లో 4 ప్రశ్నలు ఉంటాయి. అందులో 2 రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు మొత్తం 2*4=8 మార్కులు.
3.సెక్షన్-3లో 4 ప్రశ్నలు ఉంటాయి. రెండింటికి సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు. మొత్తం 2*8=16. మార్కులు.
ఇక పార్ట్ బి విషయానికొస్తే..
పార్ట్ బీలో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. 10*1=10.
మంచి మార్కుల కోసం టిప్స్..
1. బేధాలు అడిగినప్పుడు పట్టిక రూపంలో రాస్తే బాగుంటుంది.
2. కిరణరేఖా చిత్రాలను ప్రతిబంబ లక్షణాలను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి.
3.ఈ సారి సిలబస్ లో 30 శాతం సిలబస్ ను తొలగించారు. మానవుని కన్ను రంగుల ప్రపంచం పాఠ్యంశంలో కాంతి పరిక్షేపణం, రసాయనబంధం, విద్యుదయస్కాంతం, కార్బన్ దాని సమ్మేళనాలు తొలగించారు. విద్యార్థులు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి.
4. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, విద్యుత్ ప్రవాహం, గోళాకర దర్పణాలతో కాంతి -పరివర్తనం పాఠ్యాంశాలతో పట్టికలను బాగా అవగతం చేసుకోవాలి.
5.ఫార్ములాలు, ప్రమాణాలను బాగా నేర్చుకోవాలి..
పైన తెలిపిన మోడల్ లో పేపర్ ఉంటుంది.. స్టూడెంట్స్ బీ ప్రిపేర్డ్.. ఆల్ ది బెస్ట్..