తెలంగాణ టు బెంగళూరు జర్నీ..ప్రయాణికులకు శుభవార్త..10శాతం రాయితీ!

-

తెలంగాణ నుంచి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బెంగళూరు మార్గంలో టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు #TGSRTC యాజమాన్యం సోమవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

బెంగళూరు రూట్‌లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది.ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ తెలిపారు. ఈ రూట్ లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్రదించాని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news