బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో !

-

  • బీజేపీ, కాంగ్రెస్ లపై మంత్రి కేటీఆర్ ఫైర్ 
  • తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరుగాప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి
  • పార్టీ శ్రేణులకు పిలుపు 

హైద‌రాబాద్ : తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ పై గత కొంత కాలంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పదును పెంచి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా జరగబోయే నాగార్జునా సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతుల తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజ‌య్‌, కాంగ్రెస్ రాష్ట్ర తాత్కాలిక చీఫ్ ఉత్త‌మ్ కుమార్ ప్ర‌భుత్వంపై నిత్యం ఏదో ఒక ఆరోప‌ణ‌, విమ‌ర్శ‌ల ప‌ర్వాన్ని కోన‌సాగిస్తున్నారు.

అయితే, తాజాగా బండిసంజ‌య్‌, ఉత్త‌మ్‌కుమార్ ల‌కు కౌంట‌ర్ ఇస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అవాకులు చ‌వాకులు పేల‌వ‌ద్ద‌నీ, త‌మ స‌హ‌నానికి సైతం ఓ హ‌ద్దు ఉంటుందంటూ హెచ్చ‌రించారు. కేసీఆర్ గన‌క ముందుండి ఉద్య‌మాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ‌క‌పోయి ఉంటే ప్ర‌స్తుతం మీకున్న టీబీజేపీ, టీపీసీపీ ప‌ద‌వులు వుండేవా? ఆ ప‌ద‌వులు ఎలా వ‌చ్చాయో తెలుసుకోండి అంటూ ప్ర‌శ్నించారు.

టీ అనేది కేసీఆర్ మీకు పెట్టిన భిక్ష అనేది గుర్తెర‌గాలంటూ హిత‌వు ప‌లికారు. రాష్ట్ర సాధ‌న కోసం తెలంగాణ ఉద్య‌మం చేసిన‌ట్టుగానే.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుప‌డుతున్న బీజేపీ, కాంగ్రెస్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టడానికి పోరు సలపాలంటూ కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 24 గంట‌ల విద్యుత్‌ను అందిస్తున్న ఘ‌న‌మైన చరిత్ర టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ఇక త్వ‌ర‌లోనే ఉద్యోగాల ఖాళీల‌ను సైతం భ‌ర్తి చేయ‌బోతున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version