వాట్సాప్ కి గట్టి ఎదురుదెబ్బ… ఆల్రెడీ 2కోట్ల మంది..

-

వాట్సాప్ ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని చెప్పినప్పటి నుండి అనేక విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలు ఇంకా విస్తరిస్తుండగానే వాట్సాప్ వాడకాన్ని తగ్గించేస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి డౌన్లోడ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మిలియన్లలో డౌన్లోడ్లు జరిగిపోయాయి. మునుముందు మరింత మంది ఇతర ప్రత్యామ్యాన యాప్ ల వైపు చూసే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారతదేశంలో రెండుకోట్ల మంది వాట్సాని డిలిట్ చేసారట. మొత్తం 40కోట్ల యూజర్లలో రెండుకోట్ల మంది డిలీట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఇంకా వాట్సాప్ పే సౌలభ్యాన్ని 92శాతం వాడమని చెప్పేసారు. అలాగే 79శాతం మంది వాట్సాప్ బిజినెస్ ని వాడట్లేదు. ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి వాట్సాప్ వినియోగదారులు భారీగా తగ్గే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version