టీఎస్పీఎస్సీ చైర్మన్ స్ట్రాంగ్ వార్నింగ్… తప్పుడు ప్రచారం చేస్తే ఉద్యోగ పరీక్షలు రాయకుండా నిషేధం

-

తెలంగాణలో ఉద్యోగాల జాతరను ప్రకటిస్తూ.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. 80 వేలకు పైగా ఉద్యోగాలను త్వరలోనే నింపుతామని.. వాటికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన అన్నారు. దీంతో చాలా ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటన ఆనందాన్ని తెచ్చింది. దీంతో ఇన్ని రోజులు సొంతూళ్లకే పరిమితం అయిన నిరుద్యోగులు మళ్లీ కోచింగ్ సెంటర్లు చూసుకునే పనిలోపడ్డారు. 

ఇదిలా ఉంటే ఉద్యోగాలపై ఫేక్ న్యూస్ లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ వాట్సాప్, సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. దీనిపై టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ. జనార్థన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే తప్పుడు ప్రచారాన్ని చేస్తారో.. ఆ అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తామని అన్నారు. అభ్యర్థులు ఆలోచించకుండా పోస్టులు పెట్టడం, ఎవరో పంపినవి ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడుతాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version