క‌వితక్కే కాబోయే సీఎం ఎనీ డౌట్స్ .. హ్యాపీ బ‌ర్త్ డే

-

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి…ఎప్పుడు ఎలాంటి రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయో అర్ధం కాకుండా ఉంది..ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి…

ఓ వైపు టీఆర్ఎస్-బీజేపీల మధ్య జరుగుతుండగా, మరో వైపు కాంగ్రెస్ ఏమో..టీఆర్ఎస్-బీజేపీలని టార్గెట్ చేసి రాజకీయం నడుపుతుంది…ఇక ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ సైతం అనేక ట్విస్ట్ లతో ముందుకొస్తున్నారు…ఇటీవల పరోక్షంగా కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలుస్తూనే..మరో వైపు జాతీయ స్థాయిలో బీజేపీపై కేసీఆర్ యుద్ధం చేస్తున్నారు.

ఇప్పుడు ఆయన పూర్తి ఫోకస్ జాతీయ రాజకీయాలపైనే ఉందని అర్ధమవుతుంది…ఖచ్చితంగా ఆయన జాతీయ రాజకీయాల వైపే వెళ్తారని చెప్పొచ్చు..ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళితే తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి…కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది…కేసీఆర్ తర్వాత తెలంగాణకు కాబోయే సీఎం కవిత అని కొత్త చర్చ మొదలైంది.

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత కాస్త సైలెంట్ అయిన విషయం తెలిసిందే…కానీ తర్వాత కేసీఆర్..కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు…ఇటీవల పదవిని రెన్యూవల్ కూడా చేశారు. ఇక అక్కడ నుంచి కవిత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఆమె తెలంగాణ సంస్కృతి కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో తెలిసిందే…తెలంగాణ జాగృతి పేరిట ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలని ఘనంగా నిర్వహిస్తున్నారు…అలాగే తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలని అందించే కార్యక్రమం మొదలుపెట్టి..విజయవంతంగా అమలు చేస్తున్నారు. అసలు చెప్పాలంటే కేసీఆర్ తర్వాత తెలంగాణ సంస్కృతిని నిలబెడుతుంది కవితక్క అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకునే పరిస్తితి.

పైగా ఇటీవల కేసీఆర్…జాతీయ స్థాయి నేతలని వరుసపెట్టి కలుస్తున్న విషయం తెలిసిందే..అయితే కేసీఆర్ తన వెంటే కవితని కూడా తీసుకెళుతున్నారు..ఇలా అన్నిరకాలుగా కవితనే హైలైట్ చేస్తూ వెళుతున్నారు…ఈ పరిణామాలు బట్టి చూస్తే నెక్స్ట్ తెలంగాణకు కాబోయే సీఎం కవితక్క అనే డౌట్ లేకుండా చెప్పేయొచ్చు…ఏదేమైనా కాబోయే సీఎం కవితక్కకు హ్యాపీ బర్త్ డే…

Read more RELATED
Recommended to you

Exit mobile version