తెలంగాణలోని తండాలకు శుభవార్త.. అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయింపు

-

మెదక్ జిల్లా : తండాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. మెదక్ శివారులో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో… టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా… మంత్రి హరీష్ రావు కు ఘన స్వాగతం పలికారు ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు.

రూ 4.20 కోట్ల తో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించనుంది. అలాగే.. మెదక్ శివారులోని పసుపు లేరు ఒడ్డున సంత్ గాడ్గే బాబా,వెల్కం బోర్డ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా లో రోడ్ స్విపింగ్ మిషన్, గిద్దెకట్ట వద్ద దోబీ ఘాట్ కు శంకు స్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ… రజకులకు ,నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ కోసం రూ 300 కేటాయిస్తున్నామని హామీ ఇచ్చారు. తండాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని.. తండాల్లో గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం రూ 600 కోట్లు కేటాయించామన్నారు. మెదక్ లో మూడు గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం నిధులు కేటాయించామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version