తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓటర్ల జాబితా ను తాజాగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925 గా ఉండగా అందులో పురుషు ఓటర్ల సంఖ్య 1,66,41,489 గా ఉంది. అలాగే రాష్ట్రంలో మహిళా ఓటర్లు 1,68,67,735 మంది ఉంటె.. థర్డ్ జండర్ ఓటర్లు మాత్రం 2,829 మంది ఉన్నారు.
అదే విధంగా రాష్ట్రంలో యువ ఓటర్లు అంటే 18 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 5,45,026 మంది ఉన్నారు. అలాగే సీనియర్ ఓటర్లు అనగా.. 85 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,22,091 గా ఉంది. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓవర్సీస్ అంటే NRI ఓటర్ల సంఖ్య 3,591 గా ఉంది. అదే విధంగా PWD ఓటర్లు 5,26,993 మంది ఉన్నారు. అయితే రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. అక్కడ 7,65,982 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా భద్రాచలం 1,54,134 మంది ఓటర్లతో ఉంది.