కేసీఆర్‌పై నిర్మలమ్మ విసుర్లు..కవిత కౌంటర్లు.!

-

కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లు రాజకీయ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రాజకీయంగా బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య వైరుధ్యం వల్ల ప్రభుత్వాల మధ్య కూడా వార్ నడుస్తోంది. ఇటు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ అధికారంలో ఉండగా, కేంద్రంలో బి‌జే‌పి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పైగా కక్షతోనే కేంద్రం..తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని..బి‌ఆర్‌ఎస్ మంత్రులు ఫైర్ అవుతున్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కే‌సి‌ఆర్..పూర్తిగా బి‌జే‌పిని టార్గెట్ చేసి విరుచుకుపడిన విషయం తెల్సిందే. మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం అంటే జోకు అని అన్నారు. ఇక కే‌సి‌ఆర్ విమర్శలపై తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు.  5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని కేసీఆర్‌ జోక్‌ అనడం ప్రజలను వెక్కిరించినట్టే అని, కేంద్రం కోరినా మెడికల్‌ కాలేజీల కోసం ప్రతిపాదనలే పంపలేదని, గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు రూ.1.39 లక్షల కోట్లు ఇచ్చామని, రాష్ట్ర అప్పు 60 వేల కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు ఎలా చేరింది?అని ప్రశ్నించారు.

ఇక నిర్మలాకు కవిత కౌంటర్లు ఇచ్చారు. అప్పుల పేరు చెప్పి కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని,  2014కు ముందు మన దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.155 లక్షల కోట్లకు చేరిందన్నారు. తెలంగాణకు మెడికల్‌ కళాశాలలు మంజూరు చేయాలని కేంద్రానికి మరోసారి ప్రతిపాదన పంపితే.. మూడో ఫేజ్‌లో పరిశీలిస్తామని చెప్పి.. నేటికీ ఇవ్వలేదని కవిత ఫైర్ అయ్యారు.

అయితే ఇలా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. రాజకీయ పరమైన వైరుధ్యాల వల్ల తెలంగాణలో కొన్ని అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పవచ్చు. మొత్తానికి ఎన్నికల వరకు వీరి వార్ నడుస్తూనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version