సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి – విజయసాయిరెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం బర్త్ డే ఘనంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కటౌట్లు, హోర్డింగులతో తెలంగాణ అంతా గులాబీ మయమైపోయింది. ఈ నేపథ్యంలోనే, సీఎం కేసీఆర్‌ కు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, కేసీఆర్‌ కు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version