తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలేదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవడో ఇవ్వలేదు మనకు.. పుణ్యానికి ఇచ్చిపోలేదు మనకు తెలంగాణను అని కేసీఆర్ పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఇవాళ ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి.. నేను చెప్పే మాట గంభీరమైన మాట అని కేసీఆర్ అన్నారు. చిన్న పొరపాటు జరిగింది 1956లో. చాలా చిన్నపొరపాటు.. మనల్ని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేశారు. 60 ఏండ్లు గోస పడ్డాం. సర్వనాశనం అయిపోయాం. ముంబై బస్సులకు పాలమూరు ఆలవాలమైంది. తాలుకాలకు తాలుకాలు ఖాలీ అయ్యాయి. లంబాడీ బిడ్డలు హైదరాబాద్‌కు ఇంకో చోటకు బతుకపోయిన పరిస్థితి. ఆనాడు మనం కండ్లారా చూశాం. బాధలు పడ్డాం అని కేసీఆర్ తెలిపారు.
అంతేకాకుండా.. మొన్ననే పాలమూరు పథకాన్ని ప్రారంభించానని ఆయన తెలిపారు. తెలంగాణను ఉత్తిగా ఇవ్వలేదని.. విద్యార్థులను బలి తీసుకొని ఇచ్చారని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు..? పాలమూరు-ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు మార్చామన్నారు. టన్నెల్స్ పుర్తయ్యాయి, మోటార్లు బిగిస్తున్నారన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారని, రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలకు సాగునీళ్లు. కరువు మనవైపు కన్నెత్తి కూడా చూడదన్నారు సీఎం కేసీఆర్.