తెలంగాణాలో మార్చ్ 31 నుంచి వైన్ షాపులు ఓపెన్…?

-

లాక్ డౌన్ అనేది చిన్న నిర్ణయం కాదు. మన జనాలకు అది సిల్లీ గా ఉంది గాని లాక్ డౌన్ వలన భారీ నష్టం జరుగుతుంది అనేది వాస్తవం. అన్ని వ్యవస్థలు ఆగిపోతాయి. ఒక్క రోజు లాక్ డౌన్ ఉంటేనే వేల కోట్ల నష్టం. అలాంటిది 21 రోజుల పాటు లాక్ డౌన్ అంటే…? దానికి దేశాలకు ఏ ఇబ్బంది ఉండదు గాని… మన దేశంలో మాత్రం దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అనేది అర్ధమవుతుంది.

రాష్ట్రాలు ఆర్ధికంగా అటు ఇటు గా ఉంటాయి. మిగులు బడ్జెట్ రాష్ట్రాలు అంటూ పెద్దగా ఏమీ లేవు అనే చెప్పాలి. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా తెలంగాణా బాగా ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎమ్మెల్యేల జీతాలు కూడా ఇవ్వలేమా అనే అనుమానం వ్యక్తమవుతుంది. సిఎం కేసీఆర్ కూడా ఆదివారం మీడియా సమావేశంలో ఇదే మాట మాట్లాడారు. మార్చి 15 నుంచి ఎక్సైజ్, పెట్రోల్, జీఎస్టీ అన్ని బంద్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో మార్చి 31 తర్వాత నుంచి మద్యం దుకాణాలను తెరిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వాటి సమయాలు, కార్యాచరణ, ఎవరిని ఎప్పుడు అనుమతించాలి అనే దాని మీద కెసిఆర్ సర్కార్ కసరత్తు చేస్తుంది. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉన్న సర్కార్… కరోనా కట్టడి అయింది అనుకునే ప్రాంతాల్లో ఇప్పుడు వైన్ షాపులను తెరిస్తే మంచిది అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మద్యం దొరక్క మందుబాబులు తెగ బాధపడుతున్నారు. వాళ్ళు కూడా పాపం ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version