సహజంగా హోలీ పండుగ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు హోలీ వేడుకలలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ ఆచారాల ప్రకారం లేక సంప్రదాయాల ప్రకారంగా హోలీ పండుగను జరుపుకోవచ్చు. అయితే హోలీ రోజు కేవలం రంగులు చల్లుకుంటూ ఆనందంగా ఉండడంతో పాటుగా కొన్ని రకాల విషయాలను పాటించడం వలన జీవితంలో ఆర్థిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు.
సహజంగా దానాలు చేయడం వలన ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. హోలీ పండుగ రోజున కూడా కొన్ని రకాల దానాలను చేస్తే ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగాలంటే ఇటువంటి పనులను తప్పకుండా చేయండి. హోలీ పండుగ రోజున పండ్లను దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయని, ఆర్థికంగా ఎదగాలంటే తప్పకుండా ఇలా చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కేవలం పండ్లను దానం చేయడం మాత్రమే కాకుండా పేదవారికి బట్టలు, చెప్పులు వంటివి కూడా దానం చేయవచ్చు. అంతేకాకుండా చలివేంద్రాలు వంటివి కూడా ఏర్పాటు చేసి మంచినీరుని కూడా దానం చేయవచ్చు.
ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుందని మరియు దేవుని అనుగ్రహం కూడా పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటే పురోహితుడికి నవధాన్యాలను తప్పకుండా దానం చేయండి. ఇలా హోలీ రోజున నవధాన్యాలను దానం చేయడం వలన ఎన్నో దోషాలు తొలగిపోతాయి. దీంతో ఆర్థిక సమస్యలు కూడా తగ్గి ఎంతో ఆనందంగా జీవించవచ్చు అని పండితులు చెబుతున్నారు. కనుక ఇటువంటి పనులను హోలీ పండుగ నాడు చేసి ఆర్ధిక సమస్యలను తగ్గించుకోండి మరియు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించండి.