ఆ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటే – కిషన్ రెడ్డి

-

రాష్ట్రంలో కుటుంబ పాలన ఆధిపత్యం, అహంకారం కొనసాగుతుందన్నారు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. బిఆర్ఎస్ ఓడిపోవడం కాదు ప్రజాస్వామికమైన పరిపాలన రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ లు కలిసి దేశంలో ఒకే మంత్రి వర్గంలో ఉన్న విషయం తెలుసని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి కెసిఆర్ ఏ విధంగా కలిసి పనిచేశారో తెలుసన్నారు. కాంగ్రెస్ కూటమిలో మేము కీలక పాత్ర పోషిస్తామని కెసిఆర్ కుటుంబ సభ్యుడు చెప్పింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.

కెసిఆర్ ప్రభుత్వం అవినీతి పాలన పోవాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని అన్నారు. కెసిఆర్ కు నిజమైన ప్రత్యామ్నాయం ఎవరో మీరే ఆలోచించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలలో లేదా ఏ ఎన్నిక అయినా తరువాత ఈ రెండు పార్టీలు ఒకే గూటికి చేరతాయి అన్నారు. కాంగ్రెస్ – బిఆర్ఎస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటేనని ఆరోపించారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version