తెలంగాణలో డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఇప్పటికే రాజకీయ పార్టీలన్ని ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ వ్యూహం ఎప్పుడూ కాస్త ముందే ఉంటుందని చెప్పవచ్చు. గత 2018 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను శ్రావణమాసంలోనే ప్రకటించింది. 2023 ఎన్నికలకు కూడా శ్రావణమాసంలో ప్రకటించాలని కసరత్తు చేస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆగస్టు 25 లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని.. ఎస్సీ, ఎస్టీలకు రూ.25 వేలు, బీసీ,ఓసీ అభ్యర్థులకు రూ.50వేలు ధరఖాస్తు ఫీజు చెల్లించాలని తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ తమ ప్రణాళికను రచిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇప్పటికే బయటికి వచ్చింది. కానీ అధికారికంగా ఈరోజు రాత్రి లేదా రేపు 80-90 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే వారు ప్రచారం చేయడానికి కాస్త ఎక్కువ సమయం ఉంటుందని భావిస్తుంది బీఆర్ఎస్.