సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో డిఫెక్ట్

-

ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై  ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. మార్చి 15న ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్‌ వేశారు. కేసు విచారణ జరుగుతుండగానే అరెస్టు చేసినట్లు అందులో ఆరోపించారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోము అని కోర్టుకు చెప్పి… దర్యాప్తు సంస్థ అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి.. దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఆన్లైన్ లో.. కవిత తరపు న్యాయవాది మోహిత్‌ రావు… సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో డిఫెక్ట్ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషన్ అసంపూర్తిగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనల మేరకు పూర్తిగా సమర్పించిన తర్వాతనే విచారణ చేస్తామని తెలిపింది. అప్పటివరకు విచారణను వాయిదా వేస్తున్నామని కోర్టు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version