నిజం గెలిస్తే బాబుకు శాశ్వత జైలు : దేవినేని అవినాష్

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టిడిపి నిరసన చేపట్టింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ కౌంటర్ ఇచ్చారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. యాత్రల పేరుతో టిడిపి నేతలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరంటూ కామెంట్స్ చేశారు. విజయవాడలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ మాట్లాడుతూ.. ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తామని నారా లోకేష్ చెప్పాడు.

లోకేష్ ఆదేశాల మేరకు టిడిపి నేతలు పని కట్టుకొని ఆందోళన చేస్తున్నారు యాత్రల పేరుతో ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు నమ్మేస్థితిలో లేరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు పేద వృద్ధులకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఒక వరం లాంటిది అన్నారు. ప్రజల వద్దకే వైద్యం ద్వారా సీఎం జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. 14 సంవత్సరాల సీఎం 43 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందా తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచి మనసు లేదన్నారు. గతంలో టిడిపి జెండా మోపిన వారికి పథకాలు అందేవి అదే సీఎం జగన్ ప్రభుత్వం అర్హత ప్రమాణికంగా పథకాల అమలవుతున్నాయి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version