చెన్నై లో ఈ రోజు పాకిస్తాన్ చాలా కీలకమైన మ్యాచ్ ఆడుతోంది.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాక వరుసగా ప్లేయర్లు విఫలం అవుతుండడం కలిసొచ్చే విషయం కాదని చెప్పాలి. పాకిస్తాన్ 30 ఓవర్లకు అయిదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో షాదాబ్ ఖాన్ మరియు సావుఢ్ షకీల్ ఉన్నారు. జట్టును ఆదుకుంటారు అనుకున్న వారంతా కూడా వరుస పెట్టి పెవిలియన్ కు క్యూ కట్టారు. బాబర్ ఒక్కడే అర్ద సెంచరీ చేసి అవుట్ అయిపోయాడు.. ఈ పిచ్ బ్యాటింగ్ కు అంత సులభం కాదు.. కనుక కనీసం 280 పరుగులు అయినా చేయనిదే సౌత్ ఆఫ్రికా ను కట్టడి చేయడం చాలా కష్టం.. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక ఈ మ్యాచ్ లో కనుక పాకిస్తాన్ ఓడిపోతే వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరడానికి అవకాశాలు దాదాపుగా లేనట్లే.
ఎందుకంటే.. ముందు ముందు ఇంకా బలమైన జట్లతో పోరాడాల్సి ఉండడంతో పాకిస్తాన్ కు కష్టమే. మరి పాకిస్తాన్ తమ తలరాతను మార్చుకుని ఈ మ్యాచ్ లో ప్రాణం పెట్టి ఆడి విజయాన్ని సొంతం చేసుకుంటారా చూడాలి.