ఫార్మూలా- ఈ కేసుపైన శాసన సభలో KTR కీలక ప్రకటన చేశారు. ఇప్పుడే మా సభ్యులు చెబుతున్నారు. నాపై ఏదో కేసు నమోదు చేశారని అసెంబ్లీ వెల్లడించారు కేటీఆర్. ప్రస్తుతం సభ నడుస్తున్న సందర్భంగా స్పీకర్ కు కోరుతున్నానని..శాసన సభలో KTR కీలక ప్రకటన చేశారు.
ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే… నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ది ఉంటే ఈ-రేసుపైన సభలో చర్చకు పెట్టాలని కోరుతున్నానని తెలిపారు. ఈ-రేసులో జరిగిన అన్ని అంశాలపైన చర్చకు సిద్దంగా ఉన్నానన్నారు కేటీఆర్. కాగా, ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు 13(1) A, 13(2)PC Act, 409, 120 B కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఒకవేళ నేరం రుజువు అయితే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది ఏసీబీ.
ఈరేస్ పై అసెంబ్లీలో చర్చ పెట్టండి – కేటీఆర్ pic.twitter.com/Zsqe2JnQN6
— ChotaNews (@ChotaNewsTelugu) December 19, 2024