తెలంగాణలో త్వరలో 11వేల ఉద్యోగాలు

-

నిరుద్యోగులు డీఎస్సీకి బాగా ప్రిపేర్ కండి…11 వేల ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేఖ పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Telangana Deputy Chief Minister Bhatti Vikramarka Mallu’s visit to Orissa has been finalized

పాఠశాలలపై లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11వేల పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలిందని భట్టి విక్రమార్క తెలిపారు. వీటితోపాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీ చేస్తూనే ఉంటుందని భట్టి విక్రమార్క వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version