111 జీవో పరిధిలోని గ్రామాల తీర్మాణాలు… సీఎం కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాలు ఎన్నాళ్ల నుంచో ఉన్న కల నెరవేరినట్లు అయింది. హైదరాబాద్ లోని మూసీ, ఈసా నదిపరివాహక ప్రాంతాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిధిలోకి వచ్చే 84 గ్రామాలు ఈ 111 జీవో పరిధిలోకి వస్తాయి. అయితే తాజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

111 జీవో పరిధికి వచ్చే గ్రామ పంచాయతీలు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మాణాలు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా ఆయా గ్రామాాల సర్పంచులు తీర్మాణాలు రెడీ చేస్తున్నారు. ఎంతో కాలంగా ఉన్న తమ బాధను అర్థం చేసుకుని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 111 జీవో రద్దును వ్యతిరేఖించే రాజకీయ పార్టీల నేతలను గ్రామాల్లోకి రానీయవద్దని తీర్మాణాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version