తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరగడంతో 16000 మెగావాట్ల మైలు రాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో
సరఫరా పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 19 ఉదయం 7 గంటల 55 నిమిషాలకు 16058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే నెల 10వ తేదీన 15998 మెగావాట్లు నమోదు కాగా.. తాజా డిమాండ్ ఆ రికార్డును అధిగమించింది. గత ఏడాది మార్చి 8న 15623 మెగావాట్లు నమోదైన రికార్డును కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 5నే అధిగమించారు.

ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి సరఫరా పరిస్థితులను సమీక్షిస్తూ ఎక్కడా లోటు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. విద్యుత్ వినియోగం పెరిగినా సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.