మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదు అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా గుంటూరు మిర్చి యార్డును ఆయన పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు రైతులు ఎరువులు బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఈరోజు రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్తి. మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు.
మా హయాంలో 21వేల నుంచి 27 వేలకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని తెలిపారు. ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. పెట్టుబడి సాయం ఇవ్వకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతుల తరపు ఉద్యమిస్తామని తెలిపారు. ఈ ఏడాది పంట దిగుబడి కూడా పడిపోయిందని తెలిపారు. సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డ్ రైతుల పరిస్థితి అర్థం కావడం లేదు. కనిపించడం లేదన్నారు. చంద్రబాబు కళ్లు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తున్నాడని తెలిపారు.