రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. గతంలో రద్దు చేయబడ్డ ప్యాసింజర్ రైళ్లను ఇవాల్టి నుంచి పునరుద్ధరణ చేస్తున్నట్లు తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటన చేసింది. హైదరాబాద్ నగర శివారు లను కలుపుతూ గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లలో సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే సోమవారం నుంచి పునరుద్ధరించింది.
ఇటీవల కాలంలో వీటిని రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి అలాగే లాగి నియమ నిబంధనలు తదితర కారణాల వల్ల ఈ పద్దెనిమిది రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోణ ఆంక్షలు ఎత్తివేశారు.
దీంతో మేడ్చల్- ఉందా నగర్, సికింద్రాబాద్ -మేడ్చల్, మేడ్చల్- ఉందా నగర్ ప్రాంతాల మధ్య 16 ప్యాసింజర్ సర్వీస్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. కాచిగూడ – కర్నూలు సిటీ ల మధ్య రెండు సర్వీసులను అందుబాటులోకి తీసుకు వస్తుంది