BREAKING: మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో 2 కోట్లు సీజ్

-

ఈరోజు ఉదయం నుండి మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇల్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లి లోని ఫామ్ మెడోస్ విల్లాలో సోదాలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఏకకాలంలో ఈ తనిఖీలలో పాల్గొన్నాయి.

ఈ తనిఖీలలో భాగంగా కొంపల్లి సమీపంలోని సుచిత్ర లో ఉంటున్న మంత్రి మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. త్రిశూల్ రెడ్డి ఇంట్లో 2 కోట్ల నగదును సీజ్ చేశారు ఐటీ అధికారులు. అలాగే మల్లారెడ్డికి సంబంధించిన నాలుగు మెడికల్ కాలేజీల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. మెడికల్ కాలేజీల ఆర్థిక లావాదేవీలలో భారీ వ్యత్యాసాలు బయటపడ్డట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version