తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా తెలంగాణకు కేంద్రం 20వేల సోలార్ అగ్రికల్చర్ పంపుసెట్లను కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి అదనంగా 450 మెగావాట్ల డీసెంట్రలైజ్డ్ గ్రిడ్ – కనెక్డెడ్ సోలార్ ప్లాంట్ లకు ఆమోదం లభించిందని చెప్పారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు. 2026తో ఈ పథకం ముగియనుందని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ ను అమలు చేయాలని కోరారు.