HHMVలో కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు (పవన్) ఢిల్లీ బయలుదేరగా…. అడ్డుకునేందుకు ఔరంగజేబు (బాబీ డియోల్) సిద్ధమవుతారు. వీరిద్దరూ కలుసుకోవడంతోనే సినిమాను ముగించేశారు. సినిమా చివర్లో ‘యుద్ధ భూమి’ అనే నేమ్ కార్డుతో అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ పార్ట్-2పై అంచనాలు పెంచేశారు.

హైందవ ధర్మ పరిరక్షణ, కోహినూర్ ను దక్కించుకునే సమయంలో ఔరంగజేబుతో వీరమల్లు పోరాట సన్నివేశాలు HHMV పార్ట్-2 యుద్దభూమిలో ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. కాగా, ఈ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్ షో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు.