సిద్దిపేట టౌన్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట టౌన్లో 220కేవీ సబ్ స్టేషన్ పేలిపోయింది. డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో ఒత్తిడితో పేలినట్లు సమాచారం అందుతోంది. దీనితో సిద్దిపేట టౌన్‌తో పాటు 5 మండలాల్లో అంధకారంలో వెళ్లాయి.
ఈ సంఘటన తెల్సుకొని హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే హరీష్.. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గజ్వేల్, హుస్నాబాద్ పైర్ ఇంజన్లతో మాట్లాడి వెంటనే రావాలని కోరారు హరీష్ రావు.
ఇక ఈ సంఘటన పై హరీష్ రావు స్పందించారు. సిద్దిపేటలోని 220 KV సబ్ స్టేషన్లో అదుపులోకి మంటలు వచ్చినట్లు పేర్కొన్నారు.మూడు గంటల పాటు నాలుగు ఫైర్ ఇంజన్లతో శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుచెప్పారు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.