అదిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నీచ సంస్కృతికి కాంగ్రెస్ తెరలేపింది… ఈ సీఎం రేవంత్… కేసీఆర్ కంటే సంకుచితంగా ఉన్నారని ఫైర్ అయ్యారు.వచ్చేది ఉందా ? సచ్చేది ఉందా అని హామీలు ఇచ్చారా ?
కాంగ్రెస్ హామీలు ప్రజలను వంచించేలా ఉన్నాయన్నారు.
కాళేశ్వరం మీద కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప చిత్తశుద్ధిలేదు… కాంగ్రెస్ కి నిజాయితీ ఉంటే నేషనల్ డాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, BRS రెండు కూడబలుక్కొని విమర్శలు చేసుకుంటున్నారని…ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఖర్మ మాకు పట్టలేదన్నారు. సొంతంగా పోటీచేస్తాం ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తామని ప్రకటించారు. టాక్స్ డేవల్యుషన్ లో 42 శాతం రాష్ట్రాలకు ఇచ్చి రాష్ట్రాల పురోభివృద్ధికి దోహదపడిన ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.