Telangana: వచ్చే 5 ఏండ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు !

-

వచ్చే 5 ఏండ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇస్తామని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ప్రకటన చేసింది. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఇండ్ల డేటా అంటూ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో 2004 నుండి 2014 వరకు 25,46,058 ఇండ్లు కట్టి ఇచ్చామని ప్రకటించింది.

25 lakh Indiramma houses in the next 5 years

2014 నుండి 2024 వరకు కేసీఆర్ హయాంలో 1,60,705 ఇండ్లు కట్టడం జరిగిందని పేర్కొంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నారని…కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల 4 వేల ఇండ్లు 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. పేదలకు ఒక లక్ష 50 వేలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారని.. వారు అర్దాంతరంగా వదిలేసిన ఇండ్లకు నిధులు మేము కేటాయించామని పేర్కొన్నారు. మీకు కావాల్సిన భవనాలు, భవంతులు పదేళ్ళలో నిర్మించుకున్నారు…పార్టీ కార్యాలయాలు, ఫామ్ హౌజ్ లు నిర్మించుకున్న శ్రద్ద.. పేదల ఇండ్ల నిర్మాణం పై లేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news