మహా లక్ష్మి పథకం ద్వారా 3200 కోట్ల ఉచిత ప్రయాణాలు

-

ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం ,డాక్టర్ సంజయ్ లతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్ లని మొదటి విడత గా ప్రారంభిస్తున్నామన్నారు.

3200 crore free travel through Maha Lakshmi scheme

జేబీఎం సంస్థ తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందని… హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్ లను ఏర్పాటు చేస్తామని వివరించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డిజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామని.. హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్ లు నడిపేలా చూస్తామని వెల్లడించారు. విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీ ని మెరుగు పరుస్తామని… తెలంగాణ రాష్ట్ర మహా లక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి 3200కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారన్నారు. ఆర్టీసీ బస్సులకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందని వివరించారు. ఆర్టీసీ – ప్రభుత్వం కలిపి త్వరలోనే బస్ ల కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ లో ఉద్యోగులు ,కార్మికులకు పిఆర్సి ,కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version