సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉంది..దాన్ని కూల్చేయాలి – హరీష్‌ రావు

-

సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉంది..దాన్ని కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడు…కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని బాంబ్‌ పేల్చారు. సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉందన్నారు. అతని తమ్ముడి ఇల్లు FTL లో ఉంది.

Harish Rao fire on hydra demolitions

ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. మీకో న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా?? అంటూ ఆగ్రహించారు. మూసి ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని హెచ్చరించారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని… హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా మూసి సుందరీకరణ అంటున్నారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version