తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీ

-

తెలంగాణలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ అధికారుల బదిలీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే బడా బడా పోస్టుల్లో ఉన్న అధికారులను బదిలీ చేసింది. కొందరి చేత రాజీనామాలు చేయించింది. మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాజాగా మరిన్ని కీలక బదిలీలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు.

సొంత జిల్లాలో పని చేస్తున్న వారితోపాటు మూడేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని డిసెంబరులో ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు వివిధ శాఖలు బదిలీలు చేపట్టాయి. పంచాయతీరాజ్ శాఖలో ఇవాళ 395 మంది బదిలీలు చేపట్టగా.. రెవెన్యూ శాఖలో 132 మంది తహసీల్దార్లను, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను శనివారం బదిలీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ భారీ బదిలీలు జరగనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news