తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టనుంది. కొత్తగా 422 బస్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్ లను, 17 ఎక్స్ప్రెస్ లు, 22 డీలక్స్ లను తీసుకురానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సులలో ఆక్యుపెన్సి పెరగడంతో ప్రయాణికులకు రక్షణ ఇచ్చేందుకు ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది.

13-15 లక్షల కిలోమీటర్లు తిరిగినా లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ పక్కన పెట్టనుంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా బస్సు సదాపాయాన్ని కల్పిస్తున్నారు. దీంతో స్త్రీలు ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మొదట్లో ఈ విధానంలో కాస్త ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.