టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ ఎజెండాలో భాగంగా.. అయిపోయిన మునుగోడు ఎన్నికలపై ఈటెల మాట్లాడారని మండిపడ్డారు. 8 ఎండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడిలో ఈటల అతిపెద్ద వాటాదారు అని ఆరోపించారు భట్టి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆస్తుల ధ్వంసంలో, దోపిడీలో ఈటల కూడా భాద్యుడేనని.. ఈటల లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ మీద పడి ఎడవడం ఏంటి? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీపై, అధ్యక్షుడిపై బురదజల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు భట్టి. మాది వ్యాపారుస్తుల పార్టీ కాదన్నారు. ఈటల నిన్నటి దాకా ఉన్న భూస్వాముల పార్టీ మాది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అన్నారు భట్టి. ప్రజలు ఇచ్చే విరాళలతో ఎన్నికలు జరుపుంటూ వచ్చామన్నారు. నితి నిజాయితీగా ఉండే పార్టీగా తప్పుడు పనులు ఎప్పుడు చేయాలేదన్నారు. మీకు ఉన్న అలవాట్లే.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నయానే భావనతో మాట్లడటం సరైంది కాదన్నారు.