ఫోన్ మాట్లాడవద్దన్నందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన 8వ తరగతి విద్యార్థిని..!

-

ఫోన్ మాట్లాడవద్దన్నందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఓ 8వ తరగతి విద్యార్థిని. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈ నెల 8న కాచిగూడ, సుందరనగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. బాలాజీరావు కుమార్తె సీహెచ్ గౌరీ(13) 8వ తరగతి చదువుతోంది.

8th class student went out side

సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి లోనై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. సెల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యలు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్ఆఫ్‌లో ఉంది. ఇంట్లోవాళ్ల ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version