ఇవాళ తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, భూపాలపల్లి, కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో.. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి.

9 medical colleges have started in Telangana

ఇందులో భాగంగానే.. ఇవాళ 9 మెడికల్ కాలేజీలను వర్చువల్‌ గా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయటంతోపాటు.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో జిల్లాకి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ సర్కార్‌ పేర్కొంది. గతేడాది ఒకే వేదిక నుంచి కేసీఆర్ 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇవాళ ఆ కాలేజీలను ఓపెనింగ్‌ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version