పెద్దపల్లిలో రాహుల్ గాంధీ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

-

పెద్దపల్లిలో రాహుల్ గాంధీ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు టీపీసీసీ సభ్యులు. ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి తదితరులు ముకుమ్ముడిగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ని జేబు సంస్థగా మార్చుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

62 Congress candidates finalized

పర్సనల్ ఎజెండాతో పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిండంటూ రేవంత్ రెడ్డిపై గంట రాములు యాదవ్, సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి ఫైర్‌ అయ్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్వేలను మార్చి తనకు అనుకూలంగా రిపోర్టు తెప్పించుకున్నాడని..రాహుల్ గాంధీ స్వతహాగా మాట్లాడుతాలేదు…రేవంత్ రెడ్డి రాసిఇచ్చింది చదువుతారని పరువు తీశారు. రాహుల్ గాంధీ మాటలను నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దుని..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందన్నారు. పార్టీలో గుర్తింపు లేనప్పుడు ఆత్మగౌరవం చంపుకొని ఉండలేమని..అందుకే మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని స్పష్టం చేశారు గంట రాములు యాదవ్, సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version