సూర్యాపేటలో మరో పరువు హత్య జరిగింది. వడ్లకొండ కృష్ణ(మాల బంటి )అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. సూర్యాపేటలోని మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. వడ్లకొండ కృష్ణ(మాల బంటి )అనే యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ నది కట్టపై మృతదేహం దొరికింది.
వడ్లకొండ కృష్ణ(మాల బంటి )అనే యువకుడిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు కృష్ణ. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు వడ్లకొండ కృష్ణ(మాల బంటి )అనే యువకుడు. పాత కక్షలే హత్యకు దారి తీసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటు వడ్లకొండ కృష్ణ(మాల బంటి )అనే యువకుడి హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.
https://twitter.com/bigtvtelugu/status/1883717654944641134