సుప్రీం కోర్టు తాజాగా మరో సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లికి నో చెప్పడం ఆత్మహత్యకు ప్రేరణ కాదని పేర్కొంది సుప్రీం. పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
తన కుమారుడితో ప్రేమలో ఉన్న యువతిని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారంటూ.. ఓ మహిళ దాఖలు పిటిషన్ ను కొట్టేస్తూ జస్టిస్ బి. వి. నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇది ఐపీసీ 306 సెక్షన్ కింద ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని చెప్పింది సుప్రీం కోర్టు. దీంతో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.