ప్రేమిస్తున్నానని ఐదేండ్లుగా మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అంతేకాదు… పెళ్లి చేసుకుంటానని మెహందీ రోజున ఉడాయించాడు ఆ యువకుడు. ఈ సంఘటన బంజారాహిల్స్ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని నివాసం ఉంటున్నాడు మహ్మద్ షోయబ్. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(20)తో ఐదేళ్ళుగా ప్రేమాయణం నడిపించాడు మహ్మద్ షోయబ్.
అయితే… ఆమె మైనర్ గా ఉన్నప్పుడే ప్రేమిస్తున్నానని శారీరకంగా లోబర్చుకున్న యువకుడు మహ్మద్ షోయబ్…బాగా వాడుకున్నాడు. ఈ తరుణంలోనే… గర్భం దాల్చింది సదరు యువతి. దీంతో కుటుంబ సభ్యులు షోయబ్ ను నిలదీయగా పెండ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడట. తీరా మెహందీ ఫంక్షన్ రోజు ఉడాయించాడు యువకుడు మహ్మద్ షోయబ్. దీంతో మహ్మద్ షోయబ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.. న్యాయం చేయాలని కోరింది. దీంతో మహ్మద్ షోయబ్… కోసం గాలిస్తున్నారు పోలీసులు.